బాబుకు చిక్కులు: రమణదీక్షితులు ఇష్యూపై బిజెపి, వైసిపి నిలదీత

First Published May 26, 2018, 7:57 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేయాలని బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేయాలని బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు, ఆ పార్టీ ఆంధ్రప్రదేస్ ఎమ్మెల్సీ మాధవ్‌, వైసీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ రమణదీక్షితులుకు మద్దతుగా నిలిచారు. 

రమణదీక్షితులను తొలగించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఎవరిచ్చారని జీవీఎల్‌ ప్రశ్నించారు. 611 జీవో ఆధారంగా తొలగించినట్లు చెప్పడం సరికాదని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా, ఇంటికి నోటీసులు పంపించి నలుగురు ప్రధాన అర్చకులను తీసేయడం దారుణమని అన్నారు. .

తిరుపతి వ్యవహారాలపై బయటకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి స్వామివారి ప్రధాన అర్చకుడని, ఆయన మాటలను కొట్టిపారేయలేమని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దానిపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని వేయాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో హిందూ ధార్మిక మండలిని వేంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖను కూడా ప్రభు త్వ శాఖలాగే భావించి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసిందని అన్నారు. రమణ దీక్షితులు ఆరోపణలను నిరసిస్తూ, టీటీడీ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తంచేస్తున్నారని, పుణ్యక్షేత్రంలో ఇలాంటివి సరి కాదని అన్నారు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలన్నారు.

click me!