పట్టిసీమలో భారీ అవినీతి: బిజెపి సంచలన ఆరోపణలు

First Published Mar 21, 2018, 5:49 PM IST
Highlights

ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి తప్పు జరగలేదన్నప్పుడు విచారణ చేయింటానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని నిలదీశారు.

చంద్రబాబునాయుడుపై బిజెపి చేసిన తాజా ఆరోపణలు అసెంబ్లీలో బాగా హీటెక్కించింది. ఎందుకంటే, చంద్రబాబు లక్ష్యంగా బిజెపి ఆరోపణలు, విమర్శల స్ధాయిని పెంచుతోంది. బుధవారం అసెంబ్లీలో బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులో  రూ. 371 కోట్లు అవినీతి జరిగిందన్నారు.

గతంలో ఇదే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా నిర్ధారించిన విషయాన్ని రాజు గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి తప్పు జరగలేదన్నప్పుడు విచారణ చేయింటానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని నిలదీశారు.

ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపించాలని డామండ్ చేశారు. లేకపోతే  సీబీఐ విచారణ అయినా సరే అని విష్ణుకుమార్ రాజు చెప్పారు. పట్టిసీమకు తాను వ్యతిరేకం కాదన్నారు.  పట్టిసీమ చాలా మంచి ప్రాజెక్టని చెబుతుండగానే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా జోక్యం చేసుకుని ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీ వాళ్ళు ప్రజా ద్రోహులన్నారు. దాంతో రెండు వైపులా పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. దేవినేని వ్యాఖ్యలపై మాజీ మంత్రి మాణిక్యాలరావు అభ్యంతరం చెప్పారు.

click me!