భైరెడ్డికి చేదు అనుభవం.. సీఎంకి స్వాగతం చెబుతామని వెళ్తే.. పక్కకి తోసేశారు

By telugu news teamFirst Published Feb 20, 2020, 10:41 AM IST
Highlights

సీఎం కాన్వాయి వస్తుండగా... అటుగా భైరెడ్డి వెళ్లాడు. దీంతో వెంటనే.. సీఎం సెక్యురిటీ సిబ్బంది..భైరెడ్డిని పక్కకు తోసేశాడు.  వెంటనే అటుగా వచ్చిన కొందరు నేతలు సెక్యూరిటీ సిబ్బందికి,  బైరెడ్డికి నచ్చచెప్పి పంపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూల్ పర్యటనలో వైసీపీ యువ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. సీఎం సెక్యురిటీ సిబ్బంది భైరెడ్డిని పక్కకు తోసేశాడు. ఈ సంఘటన కర్నూల్ లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంటి వెలుగు మూడో విడుత ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు వెళ్లారు. కాగా... సీఎం కాన్వాయి సభా కార్యక్రమానికి చేరుకునే సమయానికి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నాడు. సీఎం జగన్ కి ప్రత్యేక ఆహ్వానం పలకాలని వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

Also Read అన్నంత పనిచేశారు: సాక్షిపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు యనమల ఫిర్యాదు..

సీఎం కాన్వాయి వస్తుండగా... అటుగా భైరెడ్డి వెళ్లాడు. దీంతో వెంటనే.. సీఎం సెక్యురిటీ సిబ్బంది..భైరెడ్డిని పక్కకు తోసేశాడు.  వెంటనే అటుగా వచ్చిన కొందరు నేతలు సెక్యూరిటీ సిబ్బందికి,  బైరెడ్డికి నచ్చచెప్పి పంపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే బైరెడ్డిని అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ వ్యవహారంపై బైరెడ్డి అభిమానులు, అనుచరులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. నిందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన భైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి స్థానికంగా మంచి క్రేజ్ ఉంది. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కొడుకే ఈ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తన స్పీచులతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్థ రెడ్డి కి ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడానికి ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

click me!