రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. నిద్రపోతున్న వాడిని పిలిచి మరీ

sivanagaprasad kodati |  
Published : Sep 27, 2018, 07:31 AM IST
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. నిద్రపోతున్న వాడిని పిలిచి మరీ

సారాంశం

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. బేస్తవారిపేటకు చెందిన రమణారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. 

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. బేస్తవారిపేటకు చెందిన రమణారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న రమణారెడ్డిని మాస్కులు ధరించిన దుండగులు బయటికి పిలిపించి మరీ కత్తులతో దారుణంగా హతమార్చారు..

భర్తపై దాడిని అడ్డుకునేందుకు యత్నించిన భార్యపైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. హత్యానంతరం దుండగులు కారులో పారిపోయారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలు, ఇతర వివాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?