వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆమెను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో ఆదివారం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఆమెను చుట్టుముట్టారు.
undefined
Also Read:గ్లామర్ గర్ల్ గా రోజా డాటర్.. హీరోయిన్ కి తక్కువేమి కాదు!
ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను సైతం పట్టించుకోవడం లేదంటూ రోజాను నిలదీశారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమను కనీసం పిలవకపోవడాన్ని వారు తప్పుబట్టారు.
సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును నిలిపిన వైసీపీ కార్యకర్తలు.. రోజా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినలేదు. అంతేకాకుండా పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.
Also Read:జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?
ఇదే సమయంలో రోజా కారుపై స్థానిక నేత ప్రతాప్ దాడి చేశాడు. దీనిపై కలగజేసుకున్న రోజా అనుచరులు.. ఎన్నికల సమయంలో ప్రతాప్ డబ్బు తీసుకుని వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. హైడ్రామా అనంతరం, ఎలాగోలా గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన రోజా అక్కడి నుంచి వెనుదిరిగారు.