పుట్టినరోజున అమ్మమ్మవారింటికి వెళుతున్న ఓ బాలిక నదిలో కొట్టుకుపోయిన విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బాలికతో పాటు ఆమె సోదరుడిని కూడా నదీ ప్రవాహం కబళించింది.
కడప: వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలతో వరదలు సంభవించి భారీగా ఆస్తినష్టాన్ని సృష్టించడమే కాదు చాలామంది ప్రాణాలను బలయ్యాయి. ఇలా పుట్టినరోజున ఓ బాలిక తన సోదరుడితో సహా నదిలో కొట్టుకుపోయిన విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఇటీవల kadapa district లోvery heavy rains కురవడంతో వరద నీటితో మాండవ్య నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే కడప జిల్లా చాకిబండ గ్రామానికి చెందిన అమీన్ బాషా తన కూతురు షేక్ సాజియా(16) తన పుట్టినరోజున అమ్మమ్మ వారి ఇంట్లో జరపుకోవాలని భావించింది. దీంతో కూతురితో పాటు కొడుకు జాసిర్(11) ను తీసుకుని తండ్రి అమీన్ బాషా ద్విచక్రవాహనంపై చిత్తూరు జిల్లా కలకడకు బయలుదేరారు.
అయితే ఇటీవల వర్షాలతో భారీగా వరదనీరు చేరడంతో చిన్నమండెం మండల పరిధిలోని వండాడి గ్రామం వద్ద మాండవ్య నదిలో నీటిప్రవాహం పెరిగి రోడ్డుపైనుండి ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ నదిని పిల్లలిద్దరితో కలిసి దాటడానికి తండ్రి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిప్రవాహ దాటికి అక్కా తమ్ముడు సాజియా, జాసిర్ కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు తండ్రి అమీన్ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు.
read more ఏపీలో వరద బీభత్సం: బాధితులకు టీడీపీ చేయూత.. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, సీనియర్లతో కమిటీలు
పుట్టినరోజునే బాలికతో పాటు ఆమె సోదరుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరద ఆ తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చింది. చిన్నారులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. నదిలో నీటిఉదృతి ఎక్కువగా వుండటంతో చిన్నారులిద్దరి మృతదేహాలు లభ్యం కాలేవు. గాలింపుకొనసాగుతోంది.
ఇదిలావుంటే రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరదనీరు చేరడంతో పాపాగ్ని నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నీటి ఉదృతికి కమలాపురం, వల్లూరు మధ్య నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ వంతెన కుప్పకూలింది. అయితే ఈ సమయంలో వంతెనపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వంతెన కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తారు. దీంతో వరదనీరు భారీగా వంతెనపై అంచువరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బాగా కుంగిపోయింది. దీంతో ఈ వంతెనపై ప్రమాదం రాకపోకలకు ప్రమాదం కలుగుతుందని భావించారు. అర్ధరాత్రి వంతెన కుప్పకూలింది.
read more Heavy rains in AP: కొట్టుకుపోయిన పాపాగ్ని బ్రిడ్జి, కడపలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
ఏడు మీటర్లకు పైగా వెంతన కూలడంతో కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. కడప నుండి అనంతపురం వెళ్లే జాతీయ రహదారి కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు.కడప నుండి తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులను , ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లించారు.
ఇక కడప పట్టణంలోనూ భారీ వర్షాలు కురిసాయి. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పట్టణంలోని రాధాకృష్ణ నగర్‌లో పురాతన మూడంతస్తుల భవనం కుప్పకూలింది. మూడంతస్తుల భవనంలో చిక్కుకొన్న నాలుగేళ్ల చిన్నారి సహా ఆమె తల్లిని సురక్షితంగా బయలకు తీసుకొచ్చారు.