చంద్రబాబుకు భారీ షాక్.. కరకట్టపై గెస్ట్‌హౌస్ ‌అటాచ్ చేసిన ఏపీ సర్కార్..

Published : May 14, 2023, 11:56 AM ISTUpdated : May 14, 2023, 12:06 PM IST
చంద్రబాబుకు భారీ షాక్.. కరకట్టపై గెస్ట్‌హౌస్ ‌అటాచ్ చేసిన ఏపీ సర్కార్..

సారాంశం

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కరకట్టపై చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్ ప్రభుత్వం అటాచ్ చేసింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడకు భారీ షాక్ తగిలింది. కరకట్టపై చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్ ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్టుగా పేర్కొంది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. స్థానిక జడ్జికి సమాచారమిస్తూ కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. 

ఇక, సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోరడ్ అలైన్‌మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి  తెలిసిందే.  టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారాయణలు వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ చెబుతోంది. అధికారం ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. వ్యాపారవేత్త లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని ఆరోపించింది. 

ఈ క్రమంలోనే చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం నిబంధనల మేరకు చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేసినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే