పెగాసెస్ అంశంపై హౌస్ కమిటీని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ నెల 21నే హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తామని స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అమరావతి: Pegasus అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్ గా house committee ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram ప్రకటించారు.
Chanrababu Naidu సీఎంగా ఉన్న కాలంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం Mamata benarjee ప్రకటించిన విషయమై ఇటీవల AP Assemblyలో ఇటీవల చర్చ జరిగింది.ఈ సాఫ్ట్ వేర్ పై సమగ్రంగా విచారణ జరపించాల్సిన అవసరం ఉందని YCP సభ్యులు కోరారు. దీనిపై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. హౌస్ కమిటీ ఏర్పాటుకు Speaker ఇదివరకే అంగీకరించారు. ఇవాళ హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు
undefined
పెగాసెస్ పై ఏపీ అసెంబ్లీ కమిటీ
భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్
శ్రీమతి కొత్తపల్లి భాగ్యలక్ష్మి
గుడివాడ అమర్ నాథ్,
అబ్యయ్య చౌదరి
కొలుసు పార్ధసారథి
మెరుగు నాగార్జున
మద్దాలి గిరిధర్
ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశంపై ఈ నెల 21వ తేదీన చర్చ జరిగింది., బెంగాల్ సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలను తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని వైసీపీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఎందుకోసం ఉపయోగించారనే వషయమై విచారణ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ సభ్యులు కోరారు. ఈ విషయమై విచారణకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
పెగాసెస్ సాప్ట్ వేర్ ను తాము కొనుగోలు చేయలేదని అప్పటి ఐటీ శాఖ మంత్రి Nara Lokesh స్పష్టం చేశారు. తమపై ఈ విషయమై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశీలించిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. పెగాసెస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేస్తే అందుకు సంబంధించిన ఫైల్స్ ప్రభుత్వంలో ఉంటాయి కదా అని ప్రశ్నించారు. వ్యక్తులుగా ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయడానికి ఉండదని లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలకే ఈ సాఫ్ట్ వేర్ విక్రయిస్తారన్నారు.ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయాలని పెగాసెస్ సంస్థ తమను సంప్రదించిన మాట వాస్తవమేనని లోకేష్ అంగీకరించారు. కానీ తాము ఈ సాప్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని లోకేష్ స్పష్టం చేశారు.