టీడీపీకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే షాక్

Published : Mar 16, 2019, 01:48 PM IST
టీడీపీకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే షాక్

సారాంశం

కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి ఊహించని షాకిచ్చారు. 

కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి ఊహించని షాకిచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఇప్పుడు టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో  జయరాములు.. టీడీపీకి వీడ్కోలు పలికారు.

 శనివారం మధ్యాహ్నం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు, కుటుంబీకులతో నిశితంగా చర్చించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసేశారు. అనంతరం బీజేపీ కండువా కప్పుకున్నారు. బద్వేల్ బీజేపీ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా.. బద్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌‌ను టీడీపీ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో జెడ్పీ పీఠాల పంపకం ఖరారు.. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఎన్ని పదవులంటే?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సైబ‌రాబాద్.. బే-టెక్ సిటీ పేరుతో నిర్మాణం. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం