చంద్రబాబు నిర్ణయానికి అడ్డం తిరిగిన టీడీపీ నేత భూమా అఖిలప్రియ

By telugu teamFirst Published Apr 5, 2021, 3:00 PM IST
Highlights

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అదినేత చంద్రబాబు నిర్ణయాన్ని మరో కీలక నేత ధిక్కకరించారు. తమ పార్టీ అభ్యర్థులు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీ చేస్తారని చెప్పారు.

ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నిర్ణయానికి మరో నేత అడ్డం తిరిగారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ నేత భూమా అఖిలప్రియ చంద్రబాబుకు ఎదురు తిరిగారు. 

అళ్లగడ్డ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె చెప్పారు. నామినేషన్లు వేశారు కాబట్టి తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం చేయాలని కూడా ఆమె సూచించారు. 

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో పలు చోట్ల చంద్రబాబు నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ టీడీపీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం సాగిస్తున్నారు. 

విశాఖపట్నంలో మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారంలోకి దిగారు. బద్వేలులో శిరీష పోటీ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూడా పలు చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

click me!