పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూలు తింటున్నారు: నారాయణ

Published : Apr 05, 2021, 02:40 PM IST
పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూలు తింటున్నారు: నారాయణ

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుపతి కొండపై పాచిపోయిన లడ్డూలు తింటున్నారని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికలను ఎదుర్కోకుండా చంద్రబాబు పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఏలూరు: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్ తిరుపతి కొండపై పాచిపోయిన లడ్డూలు తింటున్నారని ఆయన అన్నారు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు ఆయన బీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు కమ్మగా, తీయగా ఉన్నాయా అని ఆయన పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించకూడదని, వాటిని ఎదుర్కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నుంచి పారిపోతే ఎలా అని ఆయన అడిగారు. కింది క్యాడర్, రాజకీయ పార్టీ, ఓట్లు ఏమవుతాయని ఆయన అడిగారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి, నలబై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి భయపడి పారిపోతే ఎలా అని ఆయన అడిగారు బతికుండి ఓటు వేయకపోతే చచ్చినట్లే లెక్క అని, చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని నారాయణ అన్నారు.

వైసీపీకి 90 శాతం ఫలితాలు అనుకూలమని ఆ పార్టీ నాయకులు అంటున్నారని అంటూ మరి నామినేషన్లు వేయకుండా అడ్డుపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగారు అధికారులు, పోలీుసలు, రౌడీలను ఉపయోగించి ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడిగారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu