కుప్పం అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో భరత్ పోటీ చేయనున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తనయుడే భరత్ . చంద్రబాబుపై చంద్రమౌళి రెండు దఫాలు పోటీ చేసి ఓటమి చెందాడు. భరత్ వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తారా లేదా అనేది కాలం నిర్ణయించనుంది.
కుప్పం: TDP చీఫ్ Chandrababu పై పోటీ చేసే అభ్యర్ధిపై YCP స్పష్టత ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా కేఆర్ జే Bharath పోటీ చేస్తారని ఏపీ మంత్రి Peddireddy Ramachandra Reddy తేల్చి చెప్పారు. హీరో Vishal ను ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపుతారనే ప్రచారానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ పెట్టారు. ఈ స్థానంలో 1983 నుండి 2019 వరకు TDP అభ్యర్ధులు విజయం సాధిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కేఆర్‌జే భరత్ కుమార్ వైసీపీ అ:భ్యర్ధిగా పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కూడా పోటీ చేస్తారని గతంలో కూడా ప్రచారం సాగింది.ఈ ప్రచారాలకు మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా తెర దించారు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి Chandramouli, చంద్రబాబుపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. చంద్రమౌళి తనయుడే కేఆర్‌జే భరత్. అనారోగ్యంతో 2020 ఏప్రిల్ 17న చంద్రమౌళి మరణించాడు. చంద్రమౌళి బతికున్నంత కాలంలో వైసీపీ కుప్పం అసెంబ్లీ ఇంచార్జీగా కొనసాగారు. చంద్రమౌళి మరణించడంతో ఆయన తనయుడు భరత్ రాజకీయాల్లో పూర్తి కాలం కేటాయించాడు. దీంతో వైసీపీకి కుప్పం అసెంబ్లీ ఇంచార్జీగా భరత్ ను వైసీపీ నియమించింది.
also read;కుప్పంలో చంద్రబాబుపై పోటీ: హీరో విశాల్ కాదు, వైసీపీ అభ్యర్ధి ఈయనే....
ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన సమయం నుండి భరత్ కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భరత్ ప్రయత్నాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోడ్పాటును అందించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ అసంతృప్తనేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసేలా చేశారు. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
మరో వైపు స్థానక సంస్థల కోటాలో భరత్ ను వైసీపీ MLC చేసింది. 2021 ఫిబ్రవరి 1వ తేదీన భరత్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 2027 వరకు భరత్ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టడంతో భరత్ మరింత దూకుడును పెంచాడు. తన తండ్రి చంద్రమౌళి చంద్రబాబుపై విజయం సాధించలేకపోయినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై తాను విజయం సాధిస్తానని భరత్ ధీమాతో ఉన్నారు.
1988 నవంబర్ 13న భరత్ జన్మించారు. బిటెక్ వరకు భరత్ చదివాడు.దుర్మ పద్మినిని భరత్ వివాహం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుప్పంలోనే ఎక్కువ సమయం భరత్ కేటాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నుండి ఓడించేందుకు గాను వైసీపీ ప్లాన్ లో ఉంది. కుప్పం నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. టీడీపీనీ ఈ నియోజకవర్గంలో బలహీన పర్చేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు.