తెలంగాణ ఫలితాలపై.. విజయనగరంలో జోరుగా బెట్టింగ్

Published : Dec 10, 2018, 09:52 AM IST
తెలంగాణ ఫలితాలపై.. విజయనగరంలో జోరుగా బెట్టింగ్

సారాంశం

ఒక పార్టీకి చెందిన వారు టీఆర్‌ఎస్ గెలుస్తుందని.. మరో పార్టీకి చెందిన వారు ప్రజా కూటమి గెలుస్తుందని పందేలు వేస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. మంగళవారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా.. ఈ ఫలితాలపై విజయనగరం జిల్లాలో జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన వారు టీఆర్‌ఎస్ గెలుస్తుందని.. మరో పార్టీకి చెందిన వారు ప్రజా కూటమి గెలుస్తుందని పందేలు వేస్తున్నారు. 

కేవలం విజయనగరం జిల్లాలోనే కాకుండా విశాఖ, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, రాయలసీమ బెట్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. తెప్రజాకూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్న కారణంగానే.. ఈ బెట్టింగ్ ల జోరు సాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 ఇప్పటికే తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కాగా.. జాతీయ మీడియా టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వగా.. లగడపాటి మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సర్వేల ఆధారంగానే బెట్టింగ్ లు సాగుతున్నట్లు తెలుస్తోంది.  చంద్రబాబుపై విముఖతతోపాటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రావాలనే ఆకాంక్షతో ఉన్న వర్గం పందాలకు ముందుకొస్తున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు తెలంగాణలో అభ్యర్థుల బలాబలాలపై అక్కడున్న తమ బం ధువులనుంచి సమాచారాన్ని రాబట్టి మరీ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu