కాయ్ రాజా కాయ్: అత్యధిక మెజారిటీ చంద్రబాబుకా, వైఎస్ జగన్ కా

By Nagaraju penumalaFirst Published May 9, 2019, 7:51 AM IST
Highlights

2014 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారా లేక తగ్గుతుందా అనే దానిపై కాయ్ రాజా కాయ్ అంటున్నారట. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వైఎస్ జగన్ మెజారిటీ భారీగా పెరుగుతోందని వైసీపీ పందెం కాస్తోందట. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి దాదాపు నెల కావస్తోంది. ఇంకా ఫలితాలు వెలువడేందుకు 14 రోజుల సమయం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తైన తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

మెుదటి దశలోనే తెలుగురాష్ట్రాల్లో ఎన్నికలు జరగడంతో దేశమంతా ఎన్నికలు ఎప్పుడవుతాయా ఫలితాలు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితాలపై రోజురోజుకు ఉత్కంఠ నెలకొంటూనే ఉంది. 

అభ్యర్థులకు ఫలితాలపై రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంటే బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం కలిసొచ్చిన కాలంగా భావిస్తున్నారట. నిన్న మెున్నటి వరకు ఏపీలో సీఎం ఎవరు అంటూ బెట్టింగ్ వేసిన బెట్టింగ్ రాయుళ్లు లోకేష్ గెలుస్తాడా అన్న దానిపై జోరుగా బెట్టింగ్ కట్టిన బెట్టింగ్ రాయుళ్లు ప్రస్తుతం రూట్ మార్చారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీపై భారీగా బెట్టింగ్ జరుగుతుందట. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎంత మేర మెజారిటీ వస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ జరుగుతుంది. 

2014 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారా లేక తగ్గుతుందా అనే దానిపై కాయ్ రాజా కాయ్ అంటున్నారట. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వైఎస్ జగన్ మెజారిటీ భారీగా పెరుగుతోందని వైసీపీ పందెం కాస్తోందట. 

ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ నడిచిన నేపథ్యంలో భారీగా మెజారిటీ ఖాయమంటున్నారు. మరోవైపు జగన్ కు పాత రికార్డులు బ్రేక్ చేసే పరిస్థితి ఉండదని టీడీపీ నేతలు బలంగా వాదిస్తోంది. వివరాల్లోకి వెళ్తే 2014 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పోటీ చేశారు. 

వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ తరపున సతీష్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు లక్ష 24వేల 243 ఓట్లు సాధించగా టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డికి కేవలం 49వేల 333 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు. 

అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో భారీగా ఓటింగ్ జరిగిందని సర్వేలు చెప్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు పడ్డాయని ఫలితంగా వైఎస్ జగన్ కు 80వేల ఓట్లు మెజారిటీ ఖాయమంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 

ఇకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు 1,02,952 ఓట్లు సాధించారు. చంద్రబాబు ప్రత్యర్థి, వైసీపీ నేత కె.చంద్రమౌళికి 55,832 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో 47,121 ఓట్లు మెజారిటీ సాధించారు చంద్రబాబు. 

అయితే ప్రస్తుతం వైసీపీ వేవ్ నడిచిన నేపథ్యంలో చంద్రబాబు మెజారిటీ భారీగా తగ్గుతుందంటూ వైసీపీ నేతలు చెప్తుంటే, 75వేలకు పైగా మెజారిటీ సాధిస్తామని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి వైఎస్ జగన్, చంద్రబాబులు గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తారా లేదా అన్నది మే 23న తెలియాల్సి ఉంది. 
 

click me!