పవన్‌కు షాక్.. కృష్ణా జిల్లా పోలీసుల విజ్ఞప్తి , బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో జనసేనాని ఫ్లైట్ నిలిపివేత

Siva Kodati |  
Published : Sep 09, 2023, 06:07 PM IST
పవన్‌కు షాక్.. కృష్ణా జిల్లా పోలీసుల విజ్ఞప్తి , బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో జనసేనాని ఫ్లైట్ నిలిపివేత

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలోనే నిలిపివేశారు. చంద్రబాబును కలిసేందుకు పవన్ బెజవాడ బయల్దేరారు. పవన్ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులను విజయవాడ పోలీసులు కోరారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఆయన విజయవాడ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని కృష్ణా జిల్లా పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్‌ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లకుండా బ్రేక్ పడింది. అనంతరం పవన్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి నిష్క్రమించారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబును కలిసేందుకు పవన్ బెజవాడ బయల్దేరారు. అయితే చంద్రబాబును కలిసేందుకు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి వుందని పోలీసులు స్పష్టం చేశారు. పవన్ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులను విజయవాడ పోలీసులు కోరారు. 

Also Read: చంద్రబాబు కోసం బెజవాడకి .. పవన్ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ

అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌ను పవన్ కల్యాణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు.  ఏ తప్పు చేయని ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి వేధిస్తున్నారని అన్నారు. గతంలో విశాఖపట్నంలో జనసేన  నాయకుల విషయంలో ఇలాగే వ్యవహరించారని పవన్ గుర్తుచేశారు. 

ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్దరాత్రి అరెస్ట్ చేసే విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో జనసేన పట్ల పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని జనసేన నాయకులను హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. చంద్రబాబు మీద నంద్యాలలో జరిగిన సంఘట కూడా అలాంటిదే. చంద్రబాబు  నాయుడును అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా జనసేన ఖండిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?