అసెంబ్లీ సమావేశాలకు సిద్దం కావాలి: మంత్రులతో జగన్

By narsimha lodeFirst Published Nov 27, 2020, 4:30 PM IST
Highlights

అసెంబ్లీ సమావేశాలకు  సంసిద్దంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులను కోరారు.

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు  సంసిద్దంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రులను కోరారు.శుక్రవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై జగన్ మంత్రులకు దిశానిర్ధేశం చేశారు.

also read:ఈ నెల 21 నుండి భూముల సర్వే: ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ సమావేశాల్లో విపక్షానికి ధీటుగా సమాధానం చెప్పాలని జగన్ మంత్రులకు సూచించారు. ఈ మేరకు ప్రిపేరై సమావేశాలకు రావాల్సిందిగా ఆయన కోరారు. ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి హాజరైతే నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలవరం ఎత్తు విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన మంత్రులకు సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదించనుంది.ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నివర్ తుఫాన్ బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో సీఎం జగన్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సబ్సిడీతో విత్తనాలు అందించాలని సీఎం ఆదేశించారు.

 

click me!