ముంచుకొస్తున్న తుఫాన్లు.. మొదట ‘బురేవి’ మూడురోజుల తేడాతో ‘టకేటి’..

By AN TeluguFirst Published Nov 27, 2020, 4:26 PM IST
Highlights

నివర్‌ తుఫాన్‌ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ బీభత్సాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాను వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 24 గంటలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంటోంది.

ఈనెల 29  ఆదివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

డిసెంబర్‌2న  'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై  దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

డిసెంబర్ 5న  మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

click me!