ఆ గెస్ట్‌హౌస్ నిర్మాణం వద్దు: ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

By Siva KodatiFirst Published Nov 27, 2020, 4:00 PM IST
Highlights

విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణ స్థలంలో చెట్లను తొలగించే పనులు చేపట్టవద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు. గ్రేహౌండ్స్ స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది.

గ్రేహౌండ్స్ స్థలంలో ఎలా నిర్మాణాలు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. అది గ్రేహౌండ్స్ కమాండర్స్ శిక్షణా కేంద్రమని పిటిషన్‌లో తెలిపారు. కొండపై గెస్ట్‌హౌస్ నిర్మిస్తే గ్రేహౌండ్స్ ట్రైనింగ్, సెక్యూరిటీ విషయాలు బయటివాళ్లకు తెలుస్తాయని పిటిషనర్ వాదించారు.

అయితే 324 ఎకరాల్లో 64 ఎకరాల్లో మాత్రమే ఆపరేషన్స్ ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మిగిలిన ప్రాంతం ఖాళీగా వుందని తెలిపారు. గ్రేహౌండ్స్ సెంటర్ ఆధునీకరణకు కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కేంద్రానికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచాణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.

click me!