బీసీలకు జగన్ పెద్ద పీట.. రాజ్యసభకు ఎన్నికైతే నేను వైసీపీలో చేరినట్లే : ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 17, 2022, 10:16 PM IST
Highlights

వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యానంటే.. పార్టీలో జాయిన్ అయినట్లేనని వ్యాఖ్యానించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్నానని .. ఈ పోరాటాన్ని గుర్తించి జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పించారని కృష్ణయ్య వెల్లడించారు.

ఏపి ముఖ్యమంత్రి వైఎస్  జగన్ (ys jagan) బి.సిలపై తనకున్న నిబద్ధతను గుర్తించారని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (r krishnaiah) . ఏపీ నుంచి భర్తీ చేయనున్న రాజ్యసభ సీట్లకు (ysrcp rajya sabha candidates) సంబంధించి వైసీపీ తరపున అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేశారు. దీనిపై సీఎం జగన్‌ను కలిసిన ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్యం బి.సి లకు పెద్దపీట వేసిందని.. బీ.సిల కోసం ఇంకా విస్తృతంగా పోరాడేందుకు అవకాశం దొరికిందని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాను అంటేనే పార్టీలో జాయిన్ అయినట్లేనని ఆయన స్పష్టం చేశారు. 

అలాగే బీసీల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు ఆర్ కృష్ణయ్య. గతంలో ఎన్నడూ ఇలాంటి అవకాశాలు బీసీలకు దక్కలేదన్నారు. జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించారని ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు సంబంధించినది కాదని.. దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్నానని కృష్ణయ్య తెలిపారు. ఈ పోరాటాన్ని గుర్తించి జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పించారని కృష్ణయ్య వెల్లడించారు. 

మరోవైపు.. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీని (tdp) జగన్  మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టారని విశ్లేషకులు అంటున్నారు. బీసీ అంటే కృష్ణయ్య.. కృష్ణయ్య అంటే బీసీ అన్నట్లుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి నాటి నుంచి పరాటం చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఆయనను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు. ఎన్నికలప్పుడు మాత్రం వాడుకుని వదిలేసింది. 

కాకపోతే.. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అంతేకాదు నాడు తెలంగాణ సీఎం అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను టీడీపీ తెరపైకి తెచ్చింది. అనంతరకాలంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటున్న ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు మద్ధతు ప్రకటించిన కృష్ణయ్య.. ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు . 

 

"

click me!