వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య: ఎంపీటీసీ బజారయ్య పోలీసులకు లొంగుబాటు

By narsimha lode  |  First Published May 1, 2022, 4:57 PM IST

జి. కొత్తపల్లికి చెందిన వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఏ  1 నిందితుగా ఉన్న ఎంపీటీసీ సభ్యుడు బజారయ్యఆదివారం నాడు  ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 



ఏలూరు: YCP నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఏ1  నిందితుడిగా ఉన్న ఎంపీటీసీ సభ్యుడు Bazaraiah ఆదివారం నాడు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.  శనివారం నాడు ద్వారకా తిరుమలలోని జి. కొత్తపల్లి  వైసీపీ నేత గంజి ప్రసాద్  హత్యకు గురయ్యాడు.  ఈ కేసులో ఏ1 గా బజారయ్య ఉన్నాడు.  ఈ హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు లొంగిపోయారు. మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం బజారయ్య Dwaraka Tirumala పోలీస్ స్టేషన్ లో బజారయ్య లొంగిపోయాడు. బజారయ్యను పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.

Ganji Prasad గతంలో TDP లో ఉండేవాడు. 2019 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరాడు. టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత హోం మంత్రి Taneti Vanitha అనుచరుడిగా ఉన్నాడు. తానేటి వనిత గతంలో గోపాలపురం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు.  కానీ గంజి ప్రసాద్ టీడీపీలోనే కొనసాగారు. గత ఎన్నికల సమయంలో ప్రసాద్ వైసీపీలో చేరారు.

Latest Videos

undefined

గంజి ప్రసాద్ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో బజారయ్యకు, గంజి ప్రసాద్ కు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.  శనివారం నాడు జి.కొత్తపల్లికి సమీపంలోనే గంజి ప్రసాద్ ను ప్రత్యర్ధులు బైక్ పై వచ్చి హత్య చేశారు.  ఈ విషయం తెలిసి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కూడా గ్రామస్తులు దాడి చేశారు.. 

గంజి ప్రసాద్ హత్య కేసులో ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య హస్తం ఉందని పోలీసులకు కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. ఇవాళ మధ్యాహ్నం తాను లొంగిపోతానని బజారయ్య పోలీసులకు సమాచారం పంపాడు. ఈ సమాచారం ప్రకారంగానే బజరాయ్య పోలీసులకు లొంగిపోయారు.

గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఇవాళ పరామర్శించారు.  హోం మంత్రి వచ్చే వరకు తాము అంత్యక్రియలు నిర్వహించబోమని కూడా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ ను కూడా విధించారు. 

గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను మంత్రి తానేటి వనిత పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా ఆరు మందికి కూడా సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.గంజి ప్రసాాద్ హత్యకు గల కారనాలపై పోలీసులు నిందిితులను విచారించనున్నారు. 

ఎంపీటీసీ సభ్యుడు బజరాయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని గంజి ప్రసాద్ భార్య హోం మంత్రి వనితను కోరారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాామని హమీ ఇచ్చారు. ఈ ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులను శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని మాజీ ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.
 

click me!