అంతర్వేది వద్ద చొచ్చుకు వచ్చిన సముద్రం: గ్రామాల్లోకి చేరిన నీరు, భయాందోళనలో స్థానికులు

By narsimha lode  |  First Published May 18, 2022, 10:57 AM IST

కోనసీమ, కాకినాడ జిల్లాల్లో బంగాళాఖాతంలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో గ్రామాల్లోకి సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది.మూడు రోజులుగా గ్రామాల్లో ఇదే రకమైన వాతావరణం నెలకొనడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.



కోనసీమ: Kona seema  జిల్లా  Antarvediకి సమీపంలోని పల్లిపాలెంలో సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది.  మూడు రోజులుగా సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు చెబుతన్నారు. మరో వైపు సముద్రం కూడా ముందుకు చొచ్చకు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కోనసీమ జిల్లాలోని తూర్పుపాలెం, శంకరగుప్తం, కేశవదాసుపాలెం తీరం అల్లకల్లోలంగా ఉంది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడతాయి. అయితే రెండు రోజుల క్రితం పౌర్ణమి వచ్చింది. ఈ సందర్భంగా సముద్రంలో Sea waves తాకిడి ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితిని సముద్రంలో తాము చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. Kakinada కోనసీమ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొందని మత్స్యకారులు మీడియాకు తెలిపారు. ఈ సముద్రపు అలలకు గాను కొబ్బరి, ఈత చెట్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని స్థానిక గ్రామాల ప్రజలు చెబుతున్నారు అంతర్వేదిలోని సెయింట్ మేరీ స్కూల్ కి సమీపంలోని సరుగుడు తోటల్లోకి సముద్రం నీరు చేరింది. మరో వైపు పల్లిపాలెం గ్రామంలో సముద్రం నీరు ముంచెత్తింది, గ్రామంలోని రోడ్లపై కూడ వరద నీరు ప్రవహిస్తోంది. 

Latest Videos

undefined

సముద్రం గతంలో నాలుగైదు కి.మీ దూరంలో ఉండేది. అయితే అంతర్వేది ప్రాంతంలో సముద్రం మూడు కి.మీ ముందుకు వచ్చింది.  100 మీటర్ల మేర రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి.  సముద్ర తీర ప్రాంతంలో ఇసుకను , మట్టిని యదేచ్ఛగా తవ్వడం కూడా సముద్రం చొచ్చుకు రావడానికి కారణమని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.

 గత ఏడాది అంతర్వేదికి 280 కి.మీ దూరంలో Earth quake ఏర్పడింది. అంతర్వేది వద్ద సముద్రం 3 కి.మీ వెనక్కి వెళ్లింది. అయితే దానికి సమీపంలోనే సముద్రం మూడు కి.మీ చొచ్చుకు వచ్చింది.  గత ఏడాది నుండి బంగాళాఖాతంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. 

also read:అసాని తుఫాన్ ఎఫెక్ట్: రెండు కి.మీ మేర కాకినాడ-ఉప్పాడ రోడ్డు బ్లాక్

2021 ఆగష్టు మాసంలో గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది.2021 జూలై నుండి ఆగష్టు వరకు సముద్రం 45  మీటర్లు ముందుకు వచ్చింది. సముద్రం నీరు చొచ్చుకు రావడంతో ఓ భవనం ధ్వంసమైంది. ఈ భవనంలో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 20 ఏళ్లకు ఓసారి సముద్రం ముందుకు వెళ్తుందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తే ఇక్కడికి 128 కి.మీ దూరంలోని ఉప్పాడ వద్ద మాత్రం సముద్రం వెనక్కి వెళ్లింది.అయితే ఇప్పుడు మాత్రం అంతర్వేది వద్ద ఒక్క చోట సముద్రం ముందుకు వస్తోంది. దాని పక్కనే సముద్రం అంతే దూరం వెనక్కి వెళ్లిపోతుంది.

2014 అక్టోబర్ 11న విశాఖ జిల్లా రాజయ్యపేట వద్ద 60 అడుగులు ముందుకు వచ్చింది సముద్రం. 2018 జూన్ 13న శ్రీకాకుళం జిల్లాలో 100 అడుగులు ముందుకు వచ్చింది. అదే రోజున విజయనగరం జిల్లా ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు వచ్చింది. 2018 అక్టోబర్ 11న శ్రీకాకుళం జిల్లా కొత్తపాలెం వద్ద 30 మీటర్లు ముందుకు వచ్చింది.  2018 డిసెంబర్ 18న మంగినపూడిలో 20 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది.
 

click me!