అంతా తూచ్, రాజీకొచ్చిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే: టీడీపీ సృష్టేనంటూ ఆరోపణ

By Nagaraju penumalaFirst Published Jul 20, 2019, 5:57 PM IST
Highlights

అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న తమను సహించలేక తమ మధ్య అగాధం ఉన్నట్లుగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులమని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాము దగ్గర బంధువులం కూడా అని చెప్పుకొచ్చారు. 
 
గుంటూరు: గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఆధిపత్యపోరు లేదని స్పష్టం చేశారు బాపట్ల ఎంపీ నందింగం సురేష్. గత కొంతకాలంగా తనకు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిల మధ్య రాజకీయ పోరు నడుస్తోందంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఎంపీ సురేష్ ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి వివరణ ఇచ్చారు.

ఉండవల్లి శ్రీదేవి తమపై కేసులు పెట్టించారంటూ వార్తలు వస్తున్నాయని అవన్నీ వట్టిదేనంటూ కొట్టిపారేశారు. తమ మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదని క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని తాడికొండ MLA ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. 

అదంతా కేవలం యెల్లో మీడియా సృష్టి అని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలు తోందని ఆరోపించారు. అవినీతి ఏ రూపంలో ఉన్న దానిని అంతమోదించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని అందులో భాగంగా తాను, ఎంపీ నందిగం సురేష్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. 

అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న తమను సహించలేక తమ మధ్య అగాధం ఉన్నట్లుగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులమని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాము దగ్గర బంధువులం కూడా అని చెప్పుకొచ్చారు. 

ఇప్పటికైనా ఎల్లో మీడియా విష ప్రచారం మానుకోవాలని లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తమ మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నట్లు వస్తున్న ప్రచారాలను కార్యకర్తలు పట్టించుకోవద్దంటూ ఎంపీ నందిగం సురేష్, ఎంపీ శ్రీదేవి స్పష్టం చేశారు. 

click me!