Bapatla assembly elections result 2024 :
Bapatla assembly elections result 2024 : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతర్వాత రెండు పార్టీల హవా బాపట్లలో సాగింది. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా బాగా దెబ్బతిని వైసిపి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం కొనసాగి రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో పదవులు పొందిన కోన కుటుంబం వైసిపిలో చేరడంలో బాపట్లలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోన రఘుపతి బాపట్ల నుండి పోటీచేసి గెలిచారు. ఇక్కడ టిడిపి కూడా బలంగానే వుంది... మూడుసార్లు ఈ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు.
బాపట్ల అసెంబ్లీ పరిధిలోని మండలాలు :
undefined
1. బాపట్ల
2. పిట్టలవానిపాలెం
3. కర్లపాలెం
బాపట్ల అసెంబ్లీ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) :
బాపట్లలో నమోదైన మొత్తం ఓటర్లు 1,85,076
పురుషులు - 91,063
మహిళలు - 94,005
బాపట్ల నియోజకవర్గ ఎన్నికలు 2024 - ప్రధాన పార్టీల అభ్యర్థులు :
వైసిపి - కోన రఘుపతి
టిడిపి - వి.నరేంద్ర వర్మ
బాపట్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
బాపట్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
బాపట్ల నియోజకవర్గంలో తెలుగు పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ రాజు 27768 ఓట్ల తేడాతో YSRCP అభ్యర్థి కోన రఘుపతిని ఓడించారు.
బాపట్ల అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు - 1,85,076
పోలైన ఓట్లు - 1,53,769 (83 శాతం)
వైసిపి - కోన రఘుపతి - 79,836 (51.92 శాతం) - 15,199 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - అన్నం సతీష్ ప్రభాకర్ - 64,637 (42 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - లక్ష్మీ నరసింహ ఇక్కుర్తి - 4,006 (2 శాతం)
బాపట్ల అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
పోలైన ఓట్లు - 1,48,808 (83 శాతం)
వైసిపి - కోన రఘుపతి - 71,076 (50 శాతం) - 5,813 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - అన్నం సతీష్ ప్రభాకర్ - 65,263 (46 శాతం) - ఓటమి