ఉత్తరాంద్ర జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైన నగరం విశాఖపట్నం. కేవలం ఉత్తరాంధ్రకు చెందినవారే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు విశాఖలో నివాసముంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినవారు, విద్యావంతులు అధికంగా వుండే విశాఖలో సంస్కృతులే కాదు రాజకీయాలు కూడా విభిన్నంగా వుంటాయి. ఇలా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోనూ ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి.
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ రాజకీయాలు :
విశాఖతూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా వుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకణలో భాగంగా 2008 లో ఈ అసెంబ్లీ ఏర్పడింది. అప్పటినుండి ఇప్పటివరకు మూడుసార్లు (2009, 2014, 2019) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు టిడిపిదే విజయం. వరుస విజయాలతో వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ కొట్టేసాడు. ఈసారి (2024 అసెంబ్లీ ఎన్నికలు) కూడా టిడిపి మళ్లీ రామకృష్ణబాబునే బరిలోకి దింపింది.
undefined
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసిపికి విజయమే లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో వున్న వైసిపి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణను తూర్పు నియోజకవర్గంలో బరిలోకి దింపుతోంది.
విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి :
1. విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 11 వరకు, 53 నుండి 55 వరకు గల వార్డులు
విశాఖ తూర్పు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,72,448
పురుషులు - 1,34,882
మహిళలు - 1,37,544
విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి : రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో వైసిపి వుంది. అందువల్లే ఇప్పటివరకు గెలుపన్నదే ఎరుగని విశాఖ తూర్పు నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు అసెంబ్లీలో పోటీ చేస్తున్నారు.
టిడిపి అభ్యర్థి : తెలుగుదేశం పార్టీ గత మూడుసార్లుగా విశాఖ తూర్పులో ఓటమన్నదే ఎరగని వెలగపూడి రామకృష్ణబాబునే మరోసారి బరిలోకి దింపింది.
విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. విశాఖపట్నం తూర్పులో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు.
విశాఖ ఈస్ట్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,73,804 (64 శాతం)
టిడిపి - వెలగపూడి రామకృష్ణబాబు - 87,073 ఓట్లు (50 శాతం) - 26,474 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - అకారమణి విజయనిర్మల - 60,599 ఓట్లు (34 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - కోన తాతారావు - 17,873 (10 శాతం)
విశాఖ తూర్పు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
టిడిపి- వెలగపూడి రామకృష్ణబాబు - 1,00,624 (60 శాతం) - 47,883 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - చెన్నుబోయిన శ్రీనివాసరావు - 52,741 (31 శాతం) - ఓటమి