ఆ ఆరు చోట్ల బ్యాలెట్ పత్రాలు దెబ్బతిన్నాయి: గోపాలకృష్ణ ద్వివేది

By narsimha lodeFirst Published Sep 19, 2021, 11:42 AM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల కౌంటింగ్ సందర్భంగా ఆరు చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.ఈ ఆరు చోట్ల బ్యాలెట్ పేపర్లు ఏ మేరకు దెబ్బతిన్నాయనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.ఈ విషయాన్ని ఎస్ఈసీకి సమాచారం పంపారు. ఎస్ఈసీ  నిర్ణయం మేరకు ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకొంటారు.


అమరావతి: రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో బ్యాలెట్ పత్రాలు దెబ్బతిన్నాయని సమాచారం అందిందని ఏపీ పంచాతీరాజ్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి  గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేలా డ్యామేజ్ ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకొంటామని గోపాలకృష్ణద్వివేది తెలిపారు.

also read:ఏపీ పరిషత్ ఎన్నికల విచిత్రం: వారు గెలిస్తే మళ్లీ అక్కడ ఎన్నికలు

ఈ విషయమై మధ్యాహ్నానికి  ఈ విషయమై ఎన్నికల సంఘం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. బ్యాలెట్ పేపర్లు కొన్ని చోట్ల వర్షం నీళ్లకు తడిసిపోయాయి. మరికొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లు చెదలు పట్టింది.  అయితే  బ్యాలెట్ పేపర్లు  ఓటును లెక్కించే విధంగా ఉన్నాయా లేవా అనే విషయమై కూడ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.

గుంటూరు జిల్లా బేజాత్‌పురంలో  బ్యాలెట్ పేపర్లు తడిసిపోయాయి.అనంతపురంలో జిల్లా గౌడనహల్లిలో బ్యాలెట్ పేపర్లు చెదలు పట్టాయని అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల  వర్షానికి బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరి బ్యాలెట్ పేపర్లు తడిసిపోయాయని అధికారులు తెలిపారు.ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకొంటుందోననేది ఆసక్తికరంగా మారింది.

click me!