చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ సమీక్ష

First Published Jan 24, 2018, 3:45 PM IST
Highlights
  • నందమూరి బాలకృష్ణ ఏమి చేసినా సంచలనమే.

నందమూరి బాలకృష్ణ ఏమి చేసినా సంచలనమే. సినిమా అయినా రాజకీయాలైనా బాలకృష్ణకు ఒకటే. అటువంటి సంచలనానికి బాలకృష్ణ తాజాగా తెరలేపారు. ఇంతకీ నందమూరి నటసింహం చేసిన సంచలనమేమిటంటే చంద్రబాబునాయుడు కుర్చీలో కూర్చుని సమీక్ష చేయటం.  ప్రపంచ ఆర్దిక ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అటువంటిది సిఎం క్యాంపు కార్యాలయంలోకి బాలకృష్ణ వెళ్ళారు. మామూలుగా అయితే సిఎం లేనపుడు క్యాంపు కార్యాలయం మూసేసి ఉంటుంది. సెక్యురిటీ ఎవరినీ లోపలకు అనుమతించరు. అటువంటిది బాలకృష్ణ సిఎం ఛాంబర్లోకి ప్రవేశించారు. లేపాక్షి పుస్తకాలపై సమీక్ష పెట్టారు. ఆ సమీక్షకు బాలకృష్ణ అధ్యక్షత వహించగా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు కూడా హాజరయ్యారు.

క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఏకంగా చంద్రబాబు కూర్చునే అధికారిక కుర్చీలో కూర్చోవటాన్ని చూసి ఉన్నతాదికారులు ఖంగుతిన్నారు. ఏం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. ఇంతలో మంత్రి దేవినేని కూడా వచ్చారు. సిఎం కుర్చీలో కూర్చున్న బాలకృష్ణను చూసి  మంత్రి కూడా ఏమి మాట్లాడలేదు.

మామూలుగా అయితే ఓ ఎంఎల్ఏ అధికారులతో సమీక్ష చేయటం సాధ్యం కాదు.  సమీక్షలంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే చేసేది. ఎంఎల్ఏ అధికారులతో మాట్లాడాలంటే మంత్రుల సమీక్షల్లోనే మాట్లాడాలి. నియోజకవర్గంలో అయితే అదికారులతో మాట్లాడవచ్చు. నిజానికి ఈరోజు జరిగిన సమీక్ష పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో జరగాలి. కానీ వెరైటీగా బాలకృష్ణ సమీక్ష చేయటం దానికి మంత్రి దేవినేనితో పాటు, ఉన్నతాధికారులు హాజరుకావటం  ఆశ్చర్యంగా ఉంది.

click me!