పత్తిపాటిపై పంతం: జగన్ పార్టీలో చేరిన ఎన్నారై మహిళ

By pratap reddyFirst Published Aug 25, 2018, 2:54 PM IST
Highlights

విడుదల రాజకుమారి అనే మహిళ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఈ నెల 24వ తేదీన జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. 

గుంటూరు: విడుదల రాజకుమారి అనే మహిళ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఈ నెల 24వ తేదీన జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్టు ద్వారా సామాజిక సేవ చేస్తున్న ఆమె చిలకలూరిపేట ప్రజలకు పరిచయమయ్యారు. 

గతంలో చంద్రబాబు అంటే అభిమానమని చెప్పి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఖర్చు అంతా తానే భరిస్తానని ఆమె టీడిపి నాయకత్వానికి చెబుకున్నారు. అయితే, ప్రత్తిపాటిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపి అధిష్టానం తేల్చి చెప్పినట్లు సమాచారం. 

దాంతో ప్రత్తిపాటిని ఓడిస్తానని ఆమె శపథం చేశారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే, మర్రి రాజశేఖర్ ను కాదని ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.

అయితే, అనూహ్యంగా ఆమె విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో ఈ నెల 24వ తేదీన వైసిపిలో చేరారు. ఆమెకు టికెట్ ఇవ్వడానికి జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు కొందరు చెబుతున్నప్పటికీ ప్రత్తిపాటి పుల్లారావును ఓడించే పంతం నెగ్గించుకోవడానికి ఆమె వైసిపిలో చేరినట్లు మరి కొందరు చెబుతున్నారు. 

మర్రి రాజశేఖర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, దాంతో ఆయన పోటీ చేసే స్థితిలో లేనట్లు చెబుతున్నారు. రాజశేఖర్ భార్యకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, జగన్ నుంచి అందుకు సంబంధించి ఏ విధమైన హామీ లేదని అంటున్నారు. దీంతో విడుదల రాజకుమారికి చిలకలూరిపేట వైసిపి టికెట్ దక్కే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

click me!