Badvel bypoll: బీజేపీ అభ్యర్ధిగా సురేష్ పేరు ఖరారు

By narsimha lode  |  First Published Oct 7, 2021, 9:17 AM IST

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్ధిగా సురేస్ ను బరిలోకి దింపనుంది. ఈ మేరకు సరేష్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సురేష్ ను బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించింది. 


అమరావతి: కడప జిల్లా badvel bypoll బీజేపీ అభ్యర్ధిగా పుంతల సురేష్ బరిలోకి దిగనున్నారు. సురేష్ పేరును బీజేపీ అధినాయకత్వం గురువారం నాడు ఖరారు చేసింది.  ఏబీవీపీ, బీజేవైఎంలలో సురేష్ సుధీర్ఘకాలం పాటు పనిచేశారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం నుండి సురేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

also read:Badvel bypoll: బిజివేముల కోట 'బద్వేల్', కాంగ్రెసేతర పార్టీలదే ఆధిపత్యం

Latest Videos

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి ycp అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య విజయం సాధించాడు. ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  

 

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పుంతల సురేష్ బరిలోకి దిగనున్నారు. సురేష్ పేరును బీజేపీ అధినాయకత్వం గురువారం నాడు ఖరారు చేసింది. ఏబీవీపీ, బీజేవైఎంలలో సురేష్ సుధీర్ఘకాలం పాటు పనిచేశారు. pic.twitter.com/lCuPjuiNZQ

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈ స్థానం నుండి పోటీకి దూరంగా ఉంటామని జనసేన ప్రకటించింది. దీంతో  ఈ స్థానంలో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. తొలుత రెండు పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపుతామని bjp ప్రకటించింది. అయితే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను వైసీపీ నాయకత్వం బరిలోకి దింపింది. పోటీకి దూరంగా ఉండాలని విపక్షాలను కోరింది.   దరిమిలా పోటీకి దూరంగా ఉండాలని jana sena నిర్ణయం తీసుకొంది.

 జనసేన కంటే ముందే ఈ స్థానం నుండి పోటీకి దూరంగా ఉంటామని టీడీపీ స్పష్టం చేసింది.ఈ నెల 3వ తేదీన  బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కడప జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

బద్వేల్ లో పోటీ చేసే  అభ్యర్ధి ఎంపికపై చర్చించారు.పార్టీలో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న సురేష్ బరిలోకి దింపాలని  కమలదళం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వ తేదీన బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 2వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.


 

click me!