
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేసారు. గతకొద్దిరోజులుగా అంబటిపై విమర్శలు గుప్పిస్తూవస్తున్న అయ్యన్న తాజాగా మరింత ఘాటు పెంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు.
''బాబు ముక్కలు ముక్కలు అయినా అక్కడికి రాకుండా తాపీగా రెండు రోజుల తరువాత వచ్చాడు. అప్పటివరకు కలకత్తా హోటల్లో శ్రేయస్కరంగా పనులు చేసిన గన్నేరు పప్పు ఎవడు? ఆడియోల్లో, వీడియోల్లో దొరికిన కామ కుక్కవి నువ్వే... ఇంకా ఎవరు ఉంటారు... నీ దగ్గరకు వచ్చిన టీచర్లని, యాంకర్లని, నీ "పని" చేసే మనుషుల ఆడియోలు, వీడియో వచ్చిన తరువాత కూడా, ఇంకా డౌట్ ఎందుకు కాంబాబు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
''ఎవడో పెట్టుకున్న పార్టీని, మీ వాడు శ్రేయస్కరంగా లాగినట్టు కాంబాబు! నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా శ్రావ్యంగా సిఎంకి నీ వెధవ పనులు ఫిర్యాదు త్వరలోనే.. ఫ్రస్ట్రేషన్ లో వెంట్రుకలు పీక్కోకు కాంబాబు... మొలిచే వయస్సు కూడా కాదుగా! సోనియా ఆశీర్వాదం కోసం ఢిల్లీ పెద్దలకు పక్కలు వేసిన మహా మేత గురించి మర్చిపోతే ఎలా అప్పుడు పక్క సర్దింది నువ్వేగా. ఓ హీరోయిన్ వెంట పడి యువ మేత చేసిన చిల్లర అల్లరి గుర్తొచ్చిందా? పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నీ ఎపిసోడ్ సైడ్ చేద్దాం అనుకున్నా వైసిపి లో ఉన్న కాంబాబు ఫ్యాన్స్ + బ్లూ మీడియా నిన్ను ఇంటికి పంపడానికి పక్కా ప్రణాళికతో ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
''కామానికి తెల్ల చొక్కా వేసి కళ్ళ జోడు పెట్టినంత మాత్రానా సంస్కార వంతంగా మారదు!హైదరాబాద్ లోని ఒక ప్రముఖ టివి ఛానల్ కార్యాలయం వెనుక వీధిలో నీ రాసలీలల గెస్ట్ హౌస్ నుండి విజయవాడ లో హానీ హౌస్ వరకూ నీ కామ చరిత్ర అంతా బయటకి వస్తుంటే ఇంకా ఉడత ఊపులు ఎందుకు కాంబాబు? నేను ఒక యాంకర్ అని పెడితే నువ్వు, నీ మనుషులు ఆరుగురికి ఫోన్ చేసి తప్పైంది మెసేజ్ లు డిలీట్ చెయ్యాలని రాయభారాలు ఎందుకు సంస్కారహీనా?'' అంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేసారు.
''అడడైతే చాలు సొంత కూతురిని కూడా వంకర చూపులు, వంకర మాటలు మాట్లాడే రకం నువ్వు... కాంబాబు ఎవరు అని అడిగావ్ కదా... సదరు యూట్యూబ్ యాంకర్ త్వరలోనే సిఎంని కలవబోతుంది. అప్పుడు జగన్ రెడ్డి చెబుతాడు నీకు కాంబాబు అంటే ఎవరో. దయచేసి నన్ను సంస్కార హీనుడిగా మర్చొద్దు అంబటి రాంబాబు'' అంటూ ఓ యువతి ఫేస్ కనిపించకుండా వైన్ బాటిల్ తో వున్న ఫోటోను జతచేసి అయ్యన్న ట్వీట్ చేసారు.
''నువ్వంత సంబర పడితే మేము మాత్రం తగ్గుతామా? నువ్వు తగ్గోదు అంబటి రెచ్చిపో. నీకో హింట్... వైసీపీ+ బ్లూ మీడియా కలిసే నిన్ను ఇంటికి పంపబోతున్నారు. ఇక నువ్వు పాత మెసేజ్ లు వెతుక్కునే పనిలో ఉండు, అస్సలు తగ్గొద్దు'' అన్నారు.
''సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబు కి వాట్సాప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్...ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి. మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం'' అని అయ్యన్న స్పష్టం చేసారు.
''సూరీడు ...జగన్ రెడ్డి అంటే మీకు కోపమొస్తుంది మరి కాంబాబు! అనమంటావా? ఆడియోలో అడ్డంగా దొరికిపోయిన బ్రోకర్ నోరుమూసుకుని ఉండాలి. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే. హస్కీ వాయిస్ తో ఆడియో లు లికైతే కాంబాబు అనకపోతే రాంబాబు అంటారా? నారాయణ గారి అరెస్ట్ కి ఆధారాలు లేవు, నీ పరువు తక్కువ పనులకు ఆడియోలు ఉన్నాయి కాంబాబు!'' అంటూ మంత్రి అంబటిపై విరుచుకుపడుతూ అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికన వరుస ట్వీట్లు చేస్తున్నారు.