
తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుపై నిన్న(సోమవారం) తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో జరిగిన రాళ్ల దాడిపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇది చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించిన పనే అని అయ్యన్న ఆరోపించారు.
''పుచ్చకాయల దొంగంటే భుజాల తడుముకున్న చందంగా వుందయ్యా పెద్దిరెడ్డి నీ వాలకం. చంద్రబాబుపై దాడి జరిగింది అంటే ఆ రాళ్లు మేము విసిరినవి కావంటూ నీకు నువ్వే ప్రకటించుకోవడంతోనే నువ్వే దీని వెనుక సూత్రధారివని అని తెలిసిపోయింది'' అని అయ్యన్న పేర్కొన్నారు.
read more నీలాంటి ఫ్యాక్షన్ కుక్కలు చంద్రబాబును భయపెట్టలేవు: జగన్ పై లోకేష్ ఫైర్
చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ... ఈ ఘటనపై గవర్నర్ ని కలుస్తామంటే మంత్రి పెద్దిరెడ్డి ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి నీ రౌడీయిజం నీ గెస్ట్ హౌస్ లో చేసుకో...స్టేట్ లో చేస్తామంటే చెల్లదు అని హెచ్చరించారు.
మీ రౌడీయిజానికి, గూండాయిజానికి భయపడతామని అనుకోవటం పగటికలేనని హెచ్చరించారు. ఇకనైనా ఇలాంటి రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై దృష్టిపెట్టండి అంటూ వైసిపి ప్రభుత్వాన్ని, మంత్రి పెద్దిరెడ్డిని సూచించారు రామకృష్ణబాబు.