బెదిరించి భూములు లాక్కుంటున్న బెంజ్ కారు మంత్రి : అయ్యన్న

By AN TeluguFirst Published Oct 6, 2020, 1:01 PM IST
Highlights

మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని, బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో మంగళవారం  ఆరోపించారు.  మంత్రి కుటుంబ సభ్యులు, బినామిలపై రిజిస్ట్రేషన్లు చేయించారని మండిపడ్డారు.
మంజునాథ్ పేరు మీద మార్పించుకున్నారని అన్నారు.
 
 అయితే ఒకేసారి 4 వందల ఎకరాలు తీసుకునేందుకు ప్లాన్ చేశారని, ల్యాండ్ సీలింగ్ చట్టం ఉండడంతో ముందుగా 204 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి రాకుండా భూమి విడదీశారన్నారు. ఈ ప్లాన్ అంతా బెంజ్ కార్ మంత్రి గారిదేనని ఎద్దేవా చేశారు.

ఇలా అక్రమంగా ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములపై కర్నూలులోని కోపరేటివ్ బ్యాంక్‌లో రుణాలకు అప్లై చేశారని అయ్యన్న తెలిపారు. అయితే ఈ విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసిందని, వాళ్లు బెంగళూరులో ఉన్నందున అక్కడ పోలీస్ స్టేషన్‌లో మంత్రి తమ భూములను ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారని అయ్యన్న తెలిపారు. 

పోలీసులు కేసును కోర్టులో ఫైల్ చేశారన్నారు. అయితే ఇందులో మంజునాథ్‌కు సంబంధం లేనప్పుడు.. అమ్మే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం భూములే లేనట్లు మంత్రి పేర్కొన్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. 

click me!