నేను రెడీ మీరు రెడీనా...డేట్ ఆండ్ టైం మీరే డిసైడ్ చేయండి: సాయిరెడ్డికి అయ్యన్న సవాల్

By Arun Kumar PFirst Published May 20, 2020, 1:30 PM IST
Highlights

విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

అమరావతి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై అధికార, ప్రతిపక్ష  పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఏర్పాటుకు, విస్తరణకు అనుమతులిచ్చింది మీరేనంటూ మాజీ సీఎం చంద్రబాబుపై వైసిపి ఆరోపణలు చేస్తుంటే... వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఈ సంస్థకు కీలక అనుమతులు లభించాయని టిడిపి ఆరోపిస్తోంది. దీనిపై చర్చకు సిద్దమా అంటూ ఇరు పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు. 

''కారులోంచి దించేసి విశాఖ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించిన తరువాత విజయసాయి రెడ్డి కి మెంటల్ స్టేజ్4 కి చేరింది. ఎల్జీ ప్లాంట్ అనుమతుల పై చర్చకు హైదరాబాద్ వస్తా అని సవాల్ విసురుతున్న వస్తాదు టీడీపీ నాయకులు గ్యాస్ లీకైన గ్రామాలకు వెళ్తామంటే ఎందుకు అడ్డుపడి అరెస్ట్ చేస్తున్నట్టు'' అని ట్విట్టర్ వేదికన నిలదీశారు అయ్యన్నపాత్రుడు. 

eread more  నో క్యాష్, నో కండక్టర్... కరోనా నేపథ్యంలో ఏపిఎస్ ఆర్టీసి వినూత్న ప్రయత్నం

''దమ్ముంటే గ్యాస్ లీకైన గ్రామాల్లో జగన్ గారిని అడుగుపెట్టమను. ఎవరు అనుమతులు ఇచ్చారో, ట్రస్ట్ పేరు చెప్పి చందాలు వసూలు చేసి ప్లాంట్ తెరవడానికి అనుమతులు ఎలా వచ్చాయో అన్ని తేల్చుకుందాం. జగన్ గారితో చర్చకు నేను రెడీ. మీరు కూడా సిద్ధమైతే డేట్ అండ్ టైం మీరే ఫిక్స్ చెయ్యండి సాయిరెడ్డి'' అని ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి టిడిపి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. 

click me!