అయేషా మీరా! హత్యకేసు: రంగంలోకి దిగిన సీబీఐ

Published : Dec 28, 2018, 11:25 AM ISTUpdated : Dec 28, 2018, 11:26 AM IST
అయేషా మీరా! హత్యకేసు: రంగంలోకి దిగిన సీబీఐ

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసుపై ఎట్టకేలకు సీబీఐ కేసు నమోదు చేసింది. గత కొంతకాలంగా ఆయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసుపై ఎట్టకేలకు సీబీఐ కేసు నమోదు చేసింది. గత కొంతకాలంగా ఆయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవలే సిట్ దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం సీబీఐ కేసు నమోదు చేసింది.  కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

ఇకపోతే 2007 డిసెంబర్‌ 26న విజయవాడలోని ఓ హాస్టల్‌లో అయేషా మీరాపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అయేషా మీరా తల్లితో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 

ఈకేసులో సత్యంబాబు నిందితుడు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే సత్యంబాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అతడు ఇటీవలే విడుదలయ్యాడు. సత్యంబాబు విడుదల అనంతరం విచారణకు సిట్‌ ను నియమించింది ఏపీ సర్కార్. 

అయితే సిట్ ఇన్వెస్టిగేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కేసుకు సంబంధించి రికార్డులు ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్

ఆయేషా కేసు: సిట్‌కు కోర్టులో చుక్కెదురు, నార్కోఅనాలిసిస్ టెస్ట్‌కు నో

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu