ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభం

By telugu team  |  First Published Dec 14, 2019, 8:46 AM IST

ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్‌ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది


దాదాపు 12 సంవత్సరాల క్రితం.. ఏపీలో ఓ బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కలకలం రేపింది. తాను ఉండే హాస్టల్ బాత్రూమ్ లోనే ఆయేషా మీరా మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం అతి  కిరాతకంగా హత్య చేశారు. కాగా... ఈ కేసును దర్యాప్తును దాదాపు 12 సంవత్సరాల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం ప్రారంభించారు.

తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీ పోస్టుమార్టం కేసు సిబిఐకి అప్పగించినందున ఆధారాల కోసం రీ పోస్టు మార్టం చేస్తున్నారు.
 
ఆయేషా మీరా హత్యకేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమం ప్రొసీజర్‌ ప్రకారం, కుటుంబసభ్యుల సమక్షంలోనే నిర్వహించాలంటూ షరతులు విధించింది. దీంతో శనివారం ఉదయం తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఆయేషా మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది.

Latest Videos

 అయితే సీబీఐ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని, కోర్టు అనుమతి వచ్చిన విషయం కూడా తమ న్యాయవాది ద్వారా తెలుసుకున్నామని ఆయేషా తల్లి శంషాద్‌బేగం పేర్కొన్నారు. తమ మతాచారాలకు విరుద్ధమైనా, కేసు విచారణ ముందుకు సాగి, దోషులకు శిక్ష పడాలనే ఆలోచనతో రీ పోస్టుమార్టానికి అంగీకరిస్తున్నట్టు చెప్పారు.

click me!