అవంతికి రఘురామ ఘాటు రిప్లై: జగన్ చరిష్మా కాదు, నాగబాబునే ఓడించా...

By Sreeharsha GopaganiFirst Published Jul 27, 2020, 10:42 AM IST
Highlights

తన మీద ఎప్పుడు ఎవరు వ్యాఖ్యలు చేస్తారా అని ఎదురు చూసే రఘురామ దొరికిందే తడువుగా అవంతి వ్యాఖ్యలపై రెచ్చిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రుల గురించిన వార్తలన్నా వస్తున్నాయో లేదో కానీ... రెబెల్ ఎంపీ రఘురామా కృష్ణంరాజు మాత్రం రోజు లైం లైట్ లోనే ఉంటున్నాడు. జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు కొయ్యారని కొయ్యగా మారిన ఈ నరసాపురం ఎంపీ రోజూ కనీసం ఒక్కసారైనా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 

తాజగా రఘురామ మీద మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. జగన్మోహన్‌రెడ్డి చరిష్మాతో మాత్రమే నాగబాబుపై రఘురామ గెలుపొందారని, వైఎస్సార్సీపీ జెండాపై గెలిచిన ఆయన టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని అవంతి వ్యాఖ్యానించారు. 

నర్సాపురం నుంచి గెలిచినా ఎంపీ నరసాపురం వరకే పరిమితం అవ్వాలని,అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే భాగిండదని హెచ్చరించారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణం రాజు ఎవరు అని అయన ప్రశ్నించారు. 

విశాఖ రాజధానిగా వద్దని మాట్లాడిన చంద్రబాబు నాయుడునే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోమంటూ హెచ్చరికలు చేసారు అవంతి. ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు తెలిసుంన్నంత మాత్రాన..... అదే పనిగా వైఎస్సార్సీపీపై విమర్శించడం తగదని, తర్వాత ఆ పార్టీల నాయకులు వెంట రారని, ఇప్పటికైనా పంథా మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని అవంతి అన్నారు. 

వైఎస్సార్సీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అవంతి సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర విషయాల జోలికి రావొద్దని హెచ్చరించడం నుంచి మొదలు, నలంద కిషోర్ విషయం వరకు అనేక విషయాల్లో రఘురామపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు అవంతి. 

తన మీద ఎప్పుడు ఎవరు వ్యాఖ్యలు చేస్తారా అని ఎదురు చూసే రఘురామ దొరికిందే తడువుగా అవంతి వ్యాఖ్యలపై రెచ్చిపోయారు. రెచ్చిపోయారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీగా విజయం సాధించడంలో తన చరిష్మా కూడా ప్రముఖ పాత్ర పోషించిందని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్సి అవసరం తనకు లేదని అన్నాడు. 

కేవలం జగన్ ఛరిష్మాపై అవంతిలా తాను గెలవలేదని అన్నాడు. అవంతి కేవలం జగన్ బొమ్మ మీదనే గెలిచాడు. మరోసారి జగన్ ప్రజా ప్రతినిధులను కలవాడు అనే ఇమేజ్ ను బలపరిచేలా కరోనా వైరస్ విషయంలో జగన్ కు ఒక సలహా ఇచ్చారు. 

కరోనా సమస్యపై క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను రఘురామరాజు కోరారు. 

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందన్నారు. ఇప్పటికే 90 వేలకు పైగా పాజిటివ్‌  కేసులు.. 1,000కిపైగా మరణాలు నమోదయ్యాయని అన్నారు. తమ పశ్చిమగోదావరిలో ఒక్క రోజే 800 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లావ్యాప్తంగా కేసుల సంఖ్య 9000కు చేరువలో ఉందని,కంటైన్మెంట్ జోన్లు కూడా 732 అయ్యాయని, అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు.

click me!