డెడ్ బాడీ కావాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే..! (వీడియో)

Published : Aug 25, 2020, 10:49 AM ISTUpdated : Aug 25, 2020, 11:28 AM IST
డెడ్ బాడీ కావాలంటే.. డబ్బులు ఇవ్వాల్సిందే..! (వీడియో)

సారాంశం

మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. మృతదేహాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్‌ రూ.6 వేలు లంచం డిమాండ్‌‌ చేశారు.


మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఓ మహానుభావుడు చెప్పాడు. ఈ మాట ముమ్మాటికి నిజమని ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమౌతోంది. తాజాగా.. ఓ మహిళ చనిపోతే... ఆమె శవాన్ని వాళ్లవాళ్లకు అప్పగించడానికి కూడా బేరసారాలు సాగిస్తున్నారు. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మచిలీపట్నానికి చెందిన సుమలత అనే వివాహితను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. కాగా.. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కూతురి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. మృతదేహాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్‌ రూ.6 వేలు లంచం డిమాండ్‌‌ చేశారు.

 డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూరూ.1500 ముట్టజెప్పారు. వారి బంధువులు అటెండర్‌ బాగోతాన్ని వీడియో తీసి వైరల్‌ చేశారు. మార్చురీ అటెండర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

"

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు