మహిళా నిందితురాలితో అసభ్య ప్రవర్తన... ఎస్ఐ సస్పెన్షన్

Published : Aug 25, 2020, 10:13 AM ISTUpdated : Aug 25, 2020, 10:15 AM IST
మహిళా నిందితురాలితో అసభ్య ప్రవర్తన... ఎస్ఐ సస్పెన్షన్

సారాంశం

అదే రోజున ఎస్‌ఐ ఫోనులో నిందితురాలితో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇంటికి వస్తే కేసు లేకుండా చూస్తానని ఫోనులో మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న వీధి చిరునామాను తెలియజేశారు. 

ఆమె ఓ కేసులో నిందితురాలిగా ఉంది. కాగా... అది అవకాశంగా తీసుకున్న ఓ సబ్ ఇన్ స్పెక్టర్.. ఆమె పట్ల నీచంగా ప్రవర్తిచడం మొదలుపెట్టాడు. నిందితురాలికి ఫోన్ చేసి మరీ అసభ్యరీతిలో మాట్లాడేవాడు. కాగా.. సదరు బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో.. ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాపాక కూడలికి సమీపంలోని కుమ్మరికాలనీలో నివాసం ఉంటున్న మహిళను శనివారం మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో అరెస్టు చేశారు. అదే రోజు తుంగపేటలో నిందితురాలి తండ్రిని మద్యం సీసాల నిల్వ కేసులో అరెస్టు చేశారు. 

ఈ కేసు విషయంలో ఆదివారం వీరిని స్టేషన్‌కు పిలిపించారు. అదే రోజున ఎస్‌ఐ ఫోనులో నిందితురాలితో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇంటికి వస్తే కేసు లేకుండా చూస్తానని ఫోనులో మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న వీధి చిరునామాను తెలియజేశారు. ఒంటరిగా మాత్రమే రావాలని సూచించారు. ఎస్ఐ అసభ్య ప్రవర్తనను బాధితురాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు