(వీడియో) శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం

First Published Aug 24, 2017, 12:34 PM IST
Highlights
  • పట్టణంలోని ఓ హోటల్ వద్ద ప్రత్యర్ధులు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
  • శిల్పా వర్గంలోని చింపిరి అనే మైనారిటీ నేత అంతిమయాత్రలో పాల్గొనేందుకు చక్రపాణిరెడ్డి హాజరయ్యారు.
  • అయితే అక్కడికి వచ్చిన భూమా వర్గీయుడైన రౌడీ షీటర్ అబిరుచి మధు దాడిచేసి కాల్పులు జరిపారు.
  • అయితే, కాల్పుల నుండి చక్రపాణిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు.

నంద్యాలలో వైసీపీ నేత శిల్సా చక్రపాణిరెడ్డిపై కాల్పలు జరిగాయి. పట్టణంలోని ఓ హోటల్ వద్ద ప్రత్యర్ధులు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. శిల్పా వర్గంలోని చింపిరి అనే మైనారిటీ నేత అంతిమయాత్రలో పాల్గొనేందుకు చక్రపాణిరెడ్డి హాజరయ్యారు. అయితే అక్కడికి వచ్చిన భూమా వర్గీయుడైన రౌడీ షీటర్ అబిరుచి మధు దాడిచేసి కాల్పులు జరిపినట్లు ప్రాధమిక సమాచారం. అయితే, కాల్పుల నుండి చక్రపాణిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఇంతలో అక్కడే ఉన్నపోలీసులు వెంటనే అలర్ట్ అవటంతో చక్రపాణిరెడ్డికి ప్రాణాపాయం తప్పింది.

పోలీసులు అక్కడున్న అందరినీ చెదరగొట్టి పంపేసారు. విచిత్రమేంటంటే కాల్పలు జరిపిన వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం. నంద్యాల పోలింగ్ భారీగా జరిగిన మరుసటి రోజే వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడిపై భూమా వర్గీయులు హత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. పోలింగ్ జరిగిన మరుసటి రోజే ఈ విధంగా జరిగితే 28వ తేదీ కౌటింగ్ తర్వాత ఇంకేమి జరుగుతుందో అని స్ధానికుల్లో ఆందోళన మొదలైంది.

ఇదే విషయమై చక్రపాణి మాట్లాడుతూ తనపై కావాలనే ప్రత్యర్ధులు దాడి చేసినట్లు చెప్పారు. ప్రత్యర్ధులు ఉద్దేశ్యపూర్వకంగానే తనపై దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు. వారి వద్ద వేటకొడవళ్ళు కూడా ఉన్నాయని ఆరోపించారు. తాను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని మండిపడ్డారు. మొత్తానికి కాల్పుల ఘటన సంచలనంగా మారింది. హటాత్ సంఘటనతో పట్టణంలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

 

 

Read more news at 

 

click me!