160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

By pratap reddy  |  First Published Oct 25, 2018, 1:35 PM IST

లాంజ్ లో కూర్చున్న జగన్ వద్దకు శ్రీనివాస రావు వచ్చి సెల్ఫీ తీసుకుంటానని కోరి, మనకు 160 సీట్లు వస్తాయా, సార్ అని అడిగి కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నారు.

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. విమానాశ్రయంలో జగన్ కు వెయిటర్ శ్రీనివాస రావు టీ తీసుకుని వచ్చాడని, టీ ఇచ్చి సెల్ఫీ తీసుకుంటానని అడిగి కోడి పందేలకు వాడే కత్తితో దాడి చేశారని చెబుతున్నారు. 

దాడి చేసిన దుండగుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందినవాడని సమాచారం. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం కోర్టుకు హాజరు కావడానికి హైదరాబాదు వచ్చేందుకు విశాఖ విమానాశ్రయం చేరుకుని లాంజ్ లో కూర్చున్నారు.

Latest Videos

లాంజ్ లో కూర్చున్న జగన్ వద్దకు శ్రీనివాస రావు వచ్చి సెల్ఫీ తీసుకుంటానని కోరి, మనకు 160 సీట్లు వస్తాయా, సార్ అని అడిగి కత్తితో దాడి చేసినట్లు చెబుతున్నారు.

విమానాశ్రయంలోని క్యాంటీన్ ఎవరిది, శ్రీనివాస రావుకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

click me!