పిడుగురాళ్లలో అధికార వైసిపి కౌన్సిలర్ పై దాడి

Arun Kumar P   | Asianet News
Published : Aug 24, 2021, 01:30 PM ISTUpdated : Aug 24, 2021, 01:35 PM IST
పిడుగురాళ్లలో అధికార వైసిపి కౌన్సిలర్ పై దాడి

సారాంశం

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కౌన్సిలర్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన దుర్ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గుర్తు తెలియని దుండగులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పైనే దాడికి తెగబడ్డారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ జానీని రోడ్డుపై అడ్డగించిన దుండగులు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

ఇప్పటికే అధికార పార్టీ కౌన్సిలర్ పై జరిగిన దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ పై దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. కౌన్సిలర్ దాడికి రాజకీయ కారణాలేమయినా వున్నాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కానీ ఇటీవల జరిగిన పేకాట గొడవలే ఈ దాడికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు