భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని... పురుగుల మందు తాగిన భర్త

Arun Kumar P   | Asianet News
Published : Aug 24, 2021, 12:06 PM IST
భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని... పురుగుల మందు తాగిన భర్త

సారాంశం

భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

నందిగామ: కట్టుకున్న భార్య తనపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురయిన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్ పేట గ్రామంలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... అంబర్ పేట గ్రామంలో నాగరాజు భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇటీవల భార్యాభర్తల మద్య గొడవ జరిగింది. దీంతో నాగరాజు భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన నాగరాజు దారుణానికి పాల్పడ్డాడు. 

వీడియో

ఇంట్లో ఒంటరిగా వున్న నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా వుండటంతో విజయవాడ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే వుందని డాక్టర్లు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?