ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ చలాన్ల కుంభకోణంలో ముగ్గురు సబ్ రిజిష్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పటివరకు 12 మంది సబ్ రిజిష్ట్రార్లపై వేటేసింది. నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలాన్ల కుంభకోణంలో ముగ్గురు సబ్ రిజిష్ట్రార్లను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో సస్పెన్షన్ కు గురైన సబ్ రిజిష్ట్రార్ల సంఖ్య 12కి చేరుకొంది.
ఇప్పటికే 9 మంది సబ్ రిజిష్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.కృష్ణా జిల్లాలోని పటమట, మండపల్లి సబ్‌రిజిష్ట్రార్లతో పాటు, కడప సబ్ రిజిష్ట్రార్‌ను కూడ ఇశాళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
undefined
సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని సాఫ్ట్ వేర్ లోపాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమార్కులు కొల్లగొట్టారు. రాష్ట్రంలోని 19 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల స్కాం చోటు చేసుకొందని అధికారులు గుర్తించారు. ఈ అక్రమాల విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను మార్చివేసింది.
అక్రమ చలాన్ల వ్యవహరంపై ఏసీబీ అధికారులు గుర్తించేవరకు అధికారులకు ఏమీ తెలియకపోవడంపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నకిలీ చలాన్లతో కోల్పోయిన ఆదాయంలో ప్రభుత్వాధికారులు సుమారు కోటి రూపాయాలను రికవరీ చేశారు. ఇతర నిధులను తిరిగి రికవరీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారు.ఇదిలా ఉంటే నకిలీ చలాన్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పూర్తైన ఆస్తుల విషయంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం న్యాయ సలహా తీసుకోనుంది.