పట్టపగలే పట్టాభిపై దాడి...వైసిపి గుండారాజ్ కు నిదర్శనం: చంద్రబాబు ఆగ్రహం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Feb 02, 2021, 12:29 PM ISTUpdated : Feb 02, 2021, 12:43 PM IST
పట్టపగలే పట్టాభిపై దాడి...వైసిపి గుండారాజ్ కు నిదర్శనం: చంద్రబాబు ఆగ్రహం (వీడియో)

సారాంశం

విజయవాడలో పట్టపగలే టిడిపి నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరాంపై దాడి జరగడం వైసిపి గుండారాజ్ కు ప్రత్యక్ష సాక్ష్యమని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. 

గుంటూరు: టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. 15మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేయడం, పట్టాభిని గాయపర్చడంపై చంద్రబాబు మండిపడ్డారు.

పట్టాభిరాంపై దాడి జరిగినట్లు తెలుసుకున్న వెంటనే ఆయనను పరామర్శించడానికి చంద్రబాబు విజయవాడకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పట్టాభి ఇంటికి చేరుకున్నారు. గాయపడిని పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు రాళ్లదాడిలో ధ్వంసమైన కారును పరిశీలించారు. ఈ దాడికి సంబంధించిన వివరాలను పట్టాభిని అడిగి తెలుసుకున్నారు. 

వీడియో

''విజయవాడలో పట్టపగలు పట్టాభిపై దాడి చేయడం వైసిపి గుండారాజ్ కు ప్రత్యక్ష సాక్ష్యం. సిఎం జగన్ రెడ్డి అండతోనే వైసిపి గుండాలు రెచ్చిపోతున్నారు.  ఇంటినుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న పట్టాభిపై దాడి గర్హనీయం.  సెల్ ఫోన్ తో సహా పట్టాభి కారును ధ్వంసం చేయడం హేయం. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి పట్టాభిపై దాడి మరో సాక్ష్యం'' అన్నారు.

read more  విజయవాడలో ఉద్రిక్తత... టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిపై రాళ్ల దాడి (వీడియో)

''గతంలో పట్టాభి కారు ధ్వంసం చేసినవాళ్లపై చర్యలు లేవు. పోలీసుల ఉదాసీనతతో వైసిపి గుండాల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. పట్టాభిపై దాడిచేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. పట్టాభికి పూర్తి భద్రత కల్పించాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?