రాజారెడ్డి రాజ్యాంగమే... అందువల్లే బాబాయ్ అరెస్ట్: ఎంపీ రామ్మోహన్ నాయుడు

By Arun Kumar PFirst Published Feb 2, 2021, 11:18 AM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి స్టేషన్ కు తరలించడంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. 

 శ్రీకాకుళం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్ట్ పైటిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు.

''బాబాయ్ అచ్చెన్నాయుడు గారి లాంటి సీనియర్ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాండిడేట్లను వైసిపి బెదిరిస్తూ వున్నా పట్టించుకోని పోలీసులు టిడిపి నాయకులను అరెస్టు చేయడం దారుణం. ఈ హింసా రాజకీయాలు ఎంతవరకు?'' అని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. 

''ప్రజల్లో కింజరాపు కుటుంభానికి వున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక వైసిపి ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంది. ఈ రాజా రెడ్డి రాజ్యాంగానికి మేము భయపడము, ఎంతకైనా తెగించి ఎదురుకుంటాము. మీ కుట్రలు, పన్నాగాలను ప్రజలు క్షమించరు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది'' అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

read more  అచ్చెన్నాయుడిపై కక్ష తీరలేదా: జగన్ మీద చంద్రబాబు ఆగ్రహం

నిమ్మాడ అచ్చెన్నాయుడి స్వగ్రామం. దాంతో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని అచ్చెన్నాయుడు భావించారు. అయితే ఇందుకు అడ్డుపడుతూ వైసీపీ మద్దతుదారుడు నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చాడు. దీంతో ఆయనను అచ్చెన్నాయుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్, అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

click me!