కన్నాపై చెప్పులతో దాడి.. చంద్రబాబుకు కన్నా ఐదు ప్రశ్నలు

Published : Jul 04, 2018, 06:42 PM ISTUpdated : Jul 04, 2018, 06:58 PM IST
కన్నాపై చెప్పులతో దాడి..  చంద్రబాబుకు కన్నా ఐదు ప్రశ్నలు

సారాంశం

కావలి పర్యటనలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చెప్పుల దాడి.. దాడి చేసిన వారిని టీడీపీ కార్యకర్తలుగా భావించి చితకబాదిన బీజేపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ‌పై చెప్పుల దాడి జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కావలి వచ్చిన కన్నాపై కొందరు వ్యక్తులు చెప్పులతో దాడి చేశారు. వీరిని టీడీపీ కార్యకర్తలుగా భావించిన బీజేపీ నేతలు చితకబాదారు. ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు కావలి పీఎస్ ముందు బైఠాయించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కన్నాఓ బహిరంగ లేఖ రాశారు.. ఆ లేఖలో ఐదు ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.

* టీడీపీ వెబ్‌సైట్ నుంచి మీ మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు..?
* మీరు చేసిన తొలి వాగ్థానాలు అమలు చేశామని చెప్పగలరా..?
* ఓటుకు నోటు కేసులో ‘‘ బ్రీఫ్డ్ మీ’’ అనే మాటలు మీవి కాదని చెప్పగలరా..?
* జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయలేదా..?
* విశాఖ సమ్మిట్ ద్వారా 2,589 ఒప్పందాలు కుదుర్చుకున్నామని.. రూ.16 లక్షల 815 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 36, 87,460 ఉద్యోగాలు వచ్చాయని చూపిస్తారా..?

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు