జగన్ సర్కార్‌కు షాక్.. ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు, కార్యాచరణ ఇదే

By Siva KodatiFirst Published Feb 26, 2023, 6:49 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు షాకిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు. 

డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణకు ప్రకటించారు. వేతనాలు సకాలంలో పడకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, సీపీఎస్ తదితర అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా వున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యాచరణ ప్రకటించారు. తమ ఉద్యమానికి ప్రభుత్వమే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 13న సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు. 50 పేజీల వినతిపత్రంలో మా డిమాండ్లు వివరించామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బొప్పరాజు వెల్లడించారు.

ఉద్యమ కార్యాచరణ ఇదే :

  • వచ్చే నెల 21 నుంచి పెన్ డౌన్ 
  • మార్చి 9 న నల్ల బ్యాడ్జీల తో నిరసన.
  • మార్చి 13, 14వ తేదీల్లో భోజన విరమణ సమయంలో ఆందోళనలు
  • మార్చి 21న సెల్ ఫోన్ డౌన్
  • మార్చి 24న హెచ్‌వోడీల ఎదుట ఆందోళన
  • మార్చి 27న కోవిడ్ లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పరామర్శ
  • ఏప్రిల్ 3వ తేదీన గ్రీవిన్స్ లో కలెక్టర్‌లక వినతిపత్రం అందజేత
     

Latest Videos

click me!