చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ స్కూల్ ఆగడాలు

By Nagaraju TFirst Published Dec 27, 2018, 11:57 AM IST
Highlights

రోజురోజుకు ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులను రాచిరంపాన పెడుతున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై జాలిపడాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు రామ్ నగర్ లోని ఓప్రైవేట్ స్కూల్ విద్యార్థులపట్ల అమానుషంగా ప్రవర్తించింది. 

చిత్తూరు: రోజురోజుకు ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులను రాచిరంపాన పెడుతున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై జాలిపడాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు రామ్ నగర్ లోని ఓప్రైవేట్ స్కూల్ విద్యార్థులపట్ల అమానుషంగా ప్రవర్తించింది. 

హోమ్ వర్క్ చెయ్యని పాపానికి ఐదుగురు విద్యార్థులను నగ్నంగా బయట నిలబెట్టి కఠినంగా శిక్షించింది. అంతేకాదు చలి తీవ్రంగా ఉన్నాకూడ పట్టించుకోకుండా బట్టలు ఊడదియ్యడమే కాకుండా ఎండలో చేతులు రెండు పైకి ఎత్తేలా పనిష్మంట్ విధించింది. 

విద్యార్థులను నగ్నంగా నిలబెట్టడంపై విద్యార్థులు తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారని పంపిస్తే ఇలా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. 

దీంతో రంగంలోకి దిగిన జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థులను నగ్నంగా నిలబెట్టిన ఘటన నిజమేనని పాఠశాల యాజమాన్యం అంగీకరించింది. ఉపాధ్యాయులు కాదని స్కూల్ ఆయా ఎండలో నిలబెట్టారంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. 

నింద ఆయాపై పెట్టే ప్రయత్నం చేసింది. అయితే దీనిపై విద్యాశాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంది. ప్రైవేట్ పాఠశాల అనుమతులను రద్దు చేసింది. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.    
 

click me!