త్వరలో సైకిలెక్కనున్న మాజీ ఎమ్మెల్యే

By Nagaraju TFirst Published Dec 27, 2018, 11:37 AM IST
Highlights

 గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు కాండ్రు కమల ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులుగా తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన ఆమె ఏపార్టీలో చేరతారా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 
 

అమరావతి: గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు కాండ్రు కమల ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులుగా తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన ఆమె ఏపార్టీలో చేరతారా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

ఆమె ఏపార్టీలో చేరతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కమల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తమ బంధువు అయిన మాజీమంత్రి మురుగుడు హనుమంతరావుతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు కాండ్రు కమల. 

తాను తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు చంద్రబాబుకు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నట్టు కమల సీఎం చంద్రబాబుకు చెప్పారు. కమల పార్టీలో చేరేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

మంచిరోజు చూసుకుని పార్టీలో చేరాలని స్పష్టం చఏశారు. రాజకీయాల్లో సీనియర్‌ నాయకురాలు అయిన కమలకు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. జనవరి నెలలో కాండ్రు కమల టీడీపీలో చేరనున్నారు. 

ఇకపోతే 2009 ఎన్నికల్లో కాండ్రు కమల మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  పీఆర్పీ నుంచి పోటీచేసిన తమ్మిశెట్టి జానకీదేవిపై 13వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 
 

click me!