
మహిళ రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వారిపై లైంగిక వేధింపులు, దాడులు ఆగడం లేదు. నిత్యం మహిళలపై ఆఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట ఇవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహిళలు కనిపిస్తే చాలా కామాందులు పశువుల్లా ప్రవరిస్తున్నారు. చిన్నపిల్లలను, ముసలివాళ్లను వదలడం లేదు. ఆడవారిపై మగాళ్లు మృగాళ్లలా రెచ్చిపోతున్నారు. కొన్ని ఘటనల్లో అయితే మహిళలపై అత్యాచారానికి పాల్పడి హత్యలు కూడా చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడకుండా ప్రతిఘటించనందుకు కూడా మర్డర్లు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (andrapradesh)లోని చిత్తూరు (chittoor) జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు (chittoor) జిల్లాలోని ఎర్రావారి పాలెంట (erravari palenta) మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళల నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త కువైట్ కు వెళ్లారు. తన కూతుర్లను చూసుకుంటూ, రెండు ఆవులను కాస్తూ జీవిస్తున్నారు. పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. ఇప్పటి లాగే సోమవారం మధ్యాహ్నం ఆవులకు మేత కసం పొలానికి వెళ్లింది. అయితే అక్కడ ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
ఆ కామాందుడి ప్రయత్నాన్ని ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అతడికి కోపం వచ్చి గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని ఘటన స్థలం నుంచి కొంత దూరంలో ఉన్న పాడుబడిన బావిలో పారేశాడు. మృతదేహాన్ని గమనించి స్థానిక రైతు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి పోలీసులు చేరకున్నారు. డాగ్ స్క్వాడ్ ను పిలిపించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. తల్లి మృతి చెందడంతో పిల్లలు ఇద్దరు తీవ్రంగా రోదించారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
రెండు రోజుల కిందట యూపీ (up) లో ఓ కాలేజీ స్టూడెంట్ పై కొందరు కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మీరట్‌లోని సర్ధానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహిళ ప్రతీ రోజూ ఖటోలీలో ఉండే కాలేజీకి వెళ్లి చదువుకుంటుంది. రోజులాగే కాలేజీకి వెళ్లిన యువతిని ఓ ఐదుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. ఆమెను అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించారు. ఢిల్లీ (delhi) కి వెళ్తున్న క్రమంలోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బెదిరించారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని హెచ్చరించారు. అనంతరం బాధిత యువతిని వారు మీరట్ కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆ సమయానికే ఆమె తల్లిదండ్రులు బిడ్డ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. కానీ ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. మీరట్ ల బాధితురాలిని దించిన వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.