
ఒంగోలు: Prakasam జిల్లా Ongole శివారులోని పారిశ్రామికవాడలో గోడౌన్ తయారు చేస్తున్న ఇద్దరిని Chennai పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం చెన్నైలో డ్రగ్స్ తయారు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. drugs తయారు చేస్తున్న ముఠాను విచారిస్తే ఒంగోలులో డ్రగ్స్ తయారీ విషయం వెలుగు చూసింది.
ఒంగోలులోని పారిశ్రామిక వాడలో ఓ గోడౌన్ ను రసాయనాలు తయారు చేసేందుకు హైద్రాబాద్ కు చెందిన Vijay Venkat Reddyలు లీజుకు తీసుకున్నారు. ఈ గోడౌన్ లో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. చెన్నై పోలీసులు సోమవారం నాడు రాత్రి గోడౌన్ పై దాడి చేశారు. ఈ గోడౌన్ ను లీజుకు తీసుకొన్న వెంకట్ రెడ్డి, విజయ్ లను చెన్నై పోలీసులు Arrest చేశారు.